Site icon NTV Telugu

Maharashtra: పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం..

Maharastra Road Accident

Maharastra Road Accident

పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో.. కారు టైర్ ఊడిపోయి పక్కనే వస్తున్న ఆటోకు తగలింది. ఈ క్రమంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే.. మద్యం మత్తులో 21 ఏళ్ల యువకుడు కారును నడుపినట్లుగా తేలింది. ఈ ప్రమాదం.. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని జగ్తాప్ డెయిరీ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read Also: Student Died: ఆర్‌టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి.. (వీడియో)

ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ.. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని.. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తుండటంతో.. వాహనాన్ని అదుపు చేయలేక అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొట్టడాని.. దీంతో వాహనం టైర్ ఊడిపోయిందని పేర్కొన్నారు. ఈ టైర్ పక్కనే వస్తున్న ఆటోకు తగలడంతో.. ఆటో పడిపోయి అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Read Also: MK Stalin: నీట్ ‘స్కామ్‌’ను అంతం చేయడమే లక్ష్యం..

ఇంతకుముందు పూణేలో.. 17 ఏళ్ల బాలుడు రూ. 3 కోట్ల విలువైన పోర్షే కారును అతి వేగంతో నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. వాహనం ఢీకొనడంతో బైక్‌ బ్యాలెన్స్‌ తప్పి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే..

Exit mobile version