NTV Telugu Site icon

Anna Canteens: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

Anna Canteens

Anna Canteens

Anna Canteens: ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రేపు(గురువారం) మరో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపటి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రారంభించనున్నారు. ఈ సారి విశాఖ నగర పరిధిలో 25 క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంటీన్లలో రూ.15కే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతోంది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.

Read Also: Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Show comments