హైదరాబాద్ సిటీ పోలీస్ అన్యువల్ స్పోర్ట్స్ మీట్‌ను సిటీ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ అన్యువల్ స్పోర్ట్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు అడవి శేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. 35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం పునర్నిర్మాణం జరిగిందన్నారు. హైదరాబాద్ మన సిటీ పోలీస్ విభాగం ఏడు జోన్లుగా విభచించబడుతోందని, పోలీస్ రోల్ కూడా పెరుగుతోంది కాబట్టి కాప్స్ కు ఫిట్ నెస్ ముఖ్యమన్నారు. యానువల్ పోలీస్ మీట్‌కు ముఖ్య అతిథిగా అడవి శేష్ హాజరు అవ్వడం సంతోషంగా ఉందని, మేజర్ ఉన్ని కృష్ణన్ కథ ఆధారంగా తీసిన మేజర్ సినిమా విశేష ఆదరణ పొందిందన్నారు. పోలీస్ డిపార్ట్మంట్ ఎలా ఫార్మ్ అవుతుంది..ఆన్న అంశంపై లోతైన రీసెర్చ్ చేసి అడవి శేష్ సినిమాలు చేస్తున్నారని, ఎక్కువగా పోలీసు విభాగానికి సంబంధించిన సినిమాలు చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
Also Read : Bandi Sanjay : ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?.. అరెస్టులు, జైళ్లు మాకు కొత్త కాదు
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అడవి శేష్ కు అభిమానులు ఉన్నారని, పోలీసులు ఫిట్‌నెస్ పైన శ్రద్ధ వహించాలి.. అందుకే పిటీ కాప్ అనే ప్రోగ్రాం రూపకల్పన చేసామని ఆయన తెలిపారు. పలు పోలీస్ స్టేషన్లకు విజిటింగ్ వెళ్ళిన సమయంలో పోలీసులలో ఫిట్‌నెస్ లేకపోవడం కనిపించిందని, బందోబస్తుకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆహార విషయంలో శ్రద్ధ వహించడం లేదన్నారు. దొరికిన సమయంలో పోలీసులు ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ వహించాలని, ఇప్పటివరకు సుమారుగా 12,500 మందికి హెల్త్ సర్వే పూర్తయిందని ఆయన తెలిపారు.
Also Read : AP Assembly: అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. వైసీపీ మంత్రుల ఆగ్రహం
ఇందులో కొంతమంది పోలీసుల ఆరోగ్యానికి సంబంధించిన పారామీటర్లు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎక్కువమంది బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని, ఫిట్ కాప్ ప్రోగ్రాం ద్వారా హెల్త్ పారామీటర్స్ సరిగా లేని వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. ఫిట్ కాప్ ప్రోగ్రాంకు అందరూ సహకారం అందించాలని, చాలామంది పోలీసులు డ్యూటీలో కుప్పకూలిపోవడం బ్లడ్ ప్రెజర్ అమాంతం పెరగడం లాంటివి మనం చూసామన్నారు. వీటిని ఇలానే వదిలేస్తే ఏమైనా జరగొచ్చు.. అందుకే ప్రతి ఒక్క పోలీస్ డైట్ తప్పనిసరిగా చూసుకోవాలని ఆయన సూచించారు. డ్యూటీ చేయించడం మాత్రమే మా బాధ్యత కాదు మీ సంక్షేమం కూడా మా బాధ్యతేనని ఆయన వ్యాఖ్యానించారు.
