Site icon NTV Telugu

BJP: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

Bjp

Bjp

తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు టీచ‌ర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల‌ను రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రక‌టించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని నియమించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కొమురయ్యను నియమించారు. అలాగే.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డిని నియమించింది తెలంగాణ బీజేపీ.

Read Also: PM Modi: ‘‘మెలోడీ’’ మీమ్స్‌పై స్పందించిన ప్రధాని మోడీ.. ఏం చెప్పారంటే..

త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. అందుకోసం.. అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కాగా.. ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదే సెగ్మెంట్ నుంచి టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి.. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం మార్చిలో ముగియనున్నది. ఈ క్రమంలో.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..

Exit mobile version