Site icon NTV Telugu

Suparipalana Tholi Adugu: సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే

Chandrababu

Chandrababu

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎమ్మెల్యేలు మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 12 న జరగాల్సిన కూటమి మొదటి వార్షికోత్సవ సభ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా పడింది.

Exit mobile version