NTV Telugu Site icon

Anjan Kumar Yadav : రాజకీయ సింపతి కోసం వాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది

Anjan Kumar Yadav

Anjan Kumar Yadav

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని రాజకీయ సింపతి కోసం వాడుకోవాలి బిఆర్ఎస్ పార్టీ చూస్తుందని మాజీ ఎంపీ, ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాడి చేస్తే , ఆ నేపన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడా డివిజన్ లో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ మాట్లాడుతూ… తాను ఎంపీగా ఉన్నపుడు జరిగిన అభివృద్ధి తప్ప ముషీరాబాద్ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీపై విసుగు చెంది ఉన్నారని… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంజన్ స్పష్టం చేశారు.

Also Read : Actor Pradeep: తెలుగు సీరియళ్ళ మీద పీహెచ్డీ సంపాదించిన ప్రదీప్ భార్య

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్, బాగ్​లింగంపల్లి, లంబాడీ తండా, ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా అంజన్​కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ జనాలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు ఉన్నారని, అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Also Read : MLC Jeevan Reddy: ఎంపీపై దాడి ఏ పరిస్థితిలో చేశాడో.. వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి