బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’.. ఈ సినిమాను సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే యూనిట్ ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా దుమ్ములేపుతుంది..ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమా పై అంచనాలను పెంచుతూ పోతోంది.
ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్ ను వదులుతూ ఫస్ట్ సింగల్ పై అప్డేట్ అందించారు మేకర్స్ . ఐదు భాషల్లో ఈ సాంగ్ గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్ తో రాబోతోంది. రేపు ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందని సమాచారం.. కానీ ఏ టైమ్ లో అనేది ప్రకటించలేదు. అయితే, ఈ అప్డేట్ తో వదలిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న రన్బీర్, రష్మీక మందన్నను చూపించారు. ఒక్క పోస్టర్ తోనే సాంగ్ పై మరింత ఆసక్తి నెలకొంది.ఈ పక్కా యాక్షన్ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి మొదలైనవారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
