ANIMAL : ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. లిప్ లాక్ పోస్టర్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’.. ఈ సినిమాను సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే యూనిట్ ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా దుమ్ములేపుతుంది..ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమా పై అంచనాలను పెంచుతూ పోతోంది.
ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్ ను వదులుతూ ఫస్ట్ సింగల్ పై అప్డేట్ అందించారు మేకర్స్ . ఐదు భాషల్లో ఈ సాంగ్ గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్ తో రాబోతోంది. రేపు ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందని సమాచారం.. కానీ ఏ టైమ్ లో అనేది ప్రకటించలేదు. అయితే, ఈ అప్డేట్ తో వదలిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న రన్బీర్, రష్మీక మందన్నను చూపించారు. ఒక్క పోస్టర్ తోనే సాంగ్ పై మరింత ఆసక్తి నెలకొంది.ఈ పక్కా యాక్షన్ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి మొదలైనవారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?