Animal : ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన సలార్ మూవీని వెనక్కి నెట్టి ఈ మూవీ ఓటీటీలో అన్ని ఇండియన్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసింది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీకి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ నమోదు కావడం విశేషం. తొలి వారంలోఈ సినిమా ఇండియన్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్ లో నంబర్ వన్ గా నిలిచింది… రెండో వారం కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ మూవీ నిలిచింది.
ఇండియన్ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నంబర్ వన్ సినిమాగా ఉన్న యానిమల్.. ఇంగ్లిషేతర సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో తొలి వారంలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా కూడా ఇదే. ఇదే ఊపులో 10 రోజుల్లోనే ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.యానిమల్ మూవీకి ఇప్పటి వరకూ 55 లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది..అయితే ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్‌షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. ఇప్పుడు ఆ రెండు సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్‌షిప్ ను యానిమల్ మూవీ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ కూడా ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. థియేటర్లలో రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన యానిమల్.. ఓటీటీలోనూ అదే స్థాయిలో సత్తా చాటుతోంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Mujse Bura na koi 🤙🏼#Animal trending #1 on @Netflix pic.twitter.com/lRpgIYoSTM
— Animal The Film (@AnimalTheFilm) February 5, 2024
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..