Site icon NTV Telugu

Animal : యానిమల్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?

Whatsapp Image 2023 11 19 At 9.53.50 Am

Whatsapp Image 2023 11 19 At 9.53.50 Am

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఇటు తెలుగు లో అటు బాలీవుడ్ లోను అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యం లోనే ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్‌ టైమ్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 21 నిమిషాలని సమాచారం.. అదే నిజమైతే ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నిడివి ఉన్న బాలీవుడ్‌ చిత్రం ఇదే కానుంది.

2016లో వచ్చిన ‘ధోనీ’ సినిమా (రన్‌టైన్‌ 3.10) తర్వాత 3 గంటలకు పైగా రన్‌ టైమ్‌ హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్‌లకు కట్టిపడేయడం ఎంతో కష్టం తో కూడుకున్న పని.. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.ఈ సినిమా టెర్రిఫిక్‌గా ఉందని, ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టుకుండా ఉంటుందని వినిపిస్తుంది.ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌ అంటే మల్టిప్లెక్స్‌ థియేటర్‌లకు మాత్రం పెద్దదెబ్బే అని చెప్పాలి… ఎప్పటిలా కాకుండాకాస్త త్వరగానే  షో లు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద సినిమాలకు ఆరు షోల వరకు చాన్స్‌ ఉంటే.. యానిమల్ సినిమాకు మాత్రం కేవలం ఐదు షోలు మాత్రమే వేసుకునే చాన్స్‌ ఉంటుంది. ఇక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో కూడా టైమింగ్స్‌ మారే చాన్స్‌ అయితే వుంది.అయితే మేకర్స్ అధికారికంగా అయితే ప్రకటించలేదు..ఈ వార్తలో నిజమెంతుందో తెలియాంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..

Exit mobile version