Site icon NTV Telugu

MP Anil Yadav : హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించిన అనిల్ యాదవ్

Mp Anil Kumar Yadav

Mp Anil Kumar Yadav

బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు అనిల్ యాదవ్ కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్‌కు అనిల్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని, దానికి కమిషనర్‌గా మంచి అధికారిగా పేరున్న రంగనాథ్ ను నియమించారన్నారు. హైడ్రా పని తీరు అభినందిస్తూ.. హైడ్రాకు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 25 లక్షల రంగనాథ్ కు అందజేశామని ఆయన తెలిపారు. పదేళ్లు అధికారంలో అన్న కేసీఆర్ హైదరాబాద్ మహానగరంగా తీర్చి దిద్దుతాం అన్నారని, కానీ హైదరాబాద్‌లోని అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆయన తెలిపారు. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేక పోయారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి.. హైదరాబాద్ అద్భుతమైన నగరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు.

Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్‌లో పర్యటన..!

అంతేకాకుండా..’ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారు. అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావద్దు అని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పదేళ్ల కింద అనేక చెరువులు నిండు కుండల ఉండేది.. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరు అయిన హైడ్రా వదిలిపెట్టదు. డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యెక దృష్టి పెట్టారు. హైడ్రా ను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలని వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. జిల్లాలకు హైడ్రా విస్తరించాలి. హైడ్రా కు పూర్తి మద్దతు ఇస్తున్నాం.’ అని ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

Kolkata rape-murder: మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’.. దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ..

Exit mobile version