వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు, గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో మెగా హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక రీజనల్ దర్శకుడిగా అనిల్ సరికొత్త రికార్డు సృష్టించారు.
అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు నిర్మాతలు సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారులకు కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు, వీరిద్దరూ ఇప్పుడు అనిల్ కోసం సరైన స్టార్ హీరోని వెతికే పనిలో ఉన్నారు. సరైన హీరో సెట్ అయితే ఆ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కుతుంది, ఈ లోపు అనిల్ చేతిలో ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ సిద్ధంగా ఉంది, అదే విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్.
Also Read:Varanasi Release Date: క్రేజీ అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
రంగంలోకి పవర్ స్టార్?
మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారనే వార్త ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం, ఆ ప్రాజెక్టును అనిల్ డైరెక్ట్ చేసే అవకాశం ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి, ఒకవేళ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ కన్ఫర్మ్ అయితే, అందులో వెంకీతో పాటు పవన్ కళ్యాణ్ ఏదైనా పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. గతంలో వీరిద్దరూ ‘గోపాల గోపాల’లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు, రీసెంట్‌గా చిరంజీవి సినిమాలో వెంకీ గెస్ట్ అప్పీరెన్స్‌తో మేజిక్ చేసిన అనిల్, ఇప్పుడు వెంకీ సినిమాలో పవన్‌ను చూపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
Also Read:Teena Sravya: కుక్కకు ‘బంగారం’ తూకం.. తప్పు తెలుసుకుని హీరోయిన్ బహిరంగ క్షమాపణలు
ఫిబ్రవరిలో క్లారిటీ
ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి, కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు, ఫిబ్రవరి నాటికి ఆయన తదుపరి సినిమాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్‌తో సీక్వెల్ ఉంటుందా లేదా పవన్ కళ్యాణ్‌తో సోలో సినిమా ఉంటుందా అన్నది అప్పటి వరకు వేచి చూడాల్సిందే, ఏది ఏమైనా, వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి నుండి మరో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రావడం మాత్రం పక్కా అనిపిస్తోంది.
