Site icon NTV Telugu

Anil Ravipudi : ఎన్ని హిట్లు కొట్టిన ఆ విషయంలో మాత్రం మారను..

Anilravipudi

Anilravipudi

ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్‌తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం తో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి మొదలుపెట్టి మొన్నటి ‘శంకర వరప్రసాద్ గారు’ వరకు ఆయన ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తీస్తే, తొమ్మిది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి ఎలాగో, రీజనల్ మార్కెట్‌లో రావిపూడి అలా ఒక సెన్సేషన్. అయితే, ఇన్ని విజయాలు ఉన్నా అనిల్ రావిపూడి‌లో రవ్వంత కూడా గర్వం లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రజంట్ రెండు మూడు హిట్లు రాగానే ఆకాశంలో విహరించే దర్శకులున్న ఈ రోజుల్లో, తొమ్మిది వరుస హిట్లతో ఉన్నా ఆయన మాత్రం సింపుల్‌గా ఉంటారు.

Also Read: Ravi Teja : రవితేజ బర్త్ డే స్పెషల్.. ఇరుముడితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

అయితే ఇదే విషయంపై ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అనిల్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ‘నేను 9 కాదు.. 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటాను. ఎందుకంటే నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, కష్టాలు అంటే ఏంటో నాకు తెలుసు.. ఇప్పటికీ రోడ్డు మీద తెలిసిన వారు కనిపిస్తే కారు దిగి పలకరించడం, వారితో కలిసి టీ తాగడం నాకి అలవాటు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావం నాకు లేదు. మనిషిని మనిషిలా గౌరవించడమే నాకు తెలుసు’ అని తెలిపాడు. ఇక ఆయనలోని ఈ జోవియల్ స్వభావమే నయనతార వంటి స్టార్ హీరోయిన్లను కూడా ఇంప్రెస్ చేసింది.ఇదే. పటాస్ తీసినప్పుడు ఎలా ఉన్నారో, ఇన్ని వందల కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండటం అనిల్ రావిపూడి గొప్పతనం.

Exit mobile version