Anil Ravipudi: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన నాయగన్ సినిమా గురించి, దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాస్ట్ సినిమాకు తనకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
READ ALSO: Rahul Dravid Records: ‘ది వాల్’ ద్రవిడ్ రేర్ రికార్డులు.. ఈ ఐదు ఎవరికీ సాధ్యం కాదేమో?
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “విజయ్ గారు తన చివరి చిత్రానికి నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. భగవంత్ కేసరి చిత్రంపై ఆయనకు గట్టి నమ్మకం ఉంది. గతంలో ఈ సినిమా రిమేక్ చేయాలని తన దగ్గరకు వచ్చినప్పుడు.. విజయ్ గారితో స్ట్రైట్ సినిమా చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్, అందులోనూ రిమేక్ అంటే ఎలా ఉంటుందో అనే భయం ఉండింది. అందుకే ఈ సినిమాను డైరెక్ట్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ ఈ సినిమా విజయ్ గారికి బాగా నచ్చింది. అందుకే ఆయన ఈ సినిమాను పట్టుబట్టి రిమేక్ చేశారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు” అని నమ్మకంగా అన్నారు.
READ ALSO: Cybercrime: భారీ సైబర్ క్రైమ్ కేసును ఛేదించిన పోలీసులు.. రూ.547 కోట్లను కొల్లగొట్టిన కేటుగాళ్లు
