Anil Ravipudi: తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి సైతం లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను సైతం ఆడియన్స్‌ను బాగా ఆదరించారు. అనిల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. తాను తీసిని తొమ్మిది సినిమాల్లో ఓ సినిమా సీక్వెల్ చేయాలని తెలిపాడు. ఆ సినిమా మరేదో కాదు.. రవితేజ నటించి “రాజాది గ్రేట్”. తాను చూసిన సినిమాల్లో రాజాది గ్రేట్ సినిమా బాగా ఆకట్టుకుందని ఇంటర్వ్యూలో జర్నలిస్టు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ స్టేట్‌మెంట్‌ను నాకు చాలా మంది చెప్పారు. రాజాది గ్రేట్‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది సీక్వెల్ కూడా అడుగుతున్నారు. ఇన్నోవేటివ్‌గా ఏదైనా ఒక ప్లాట్ పాయింట్ దొరికితే సీక్వెల్ చేస్తానని చెప్పాను.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
READ MORE: Himanta Biswa Sarma: రాహుల్, ప్రియాంకా గాంధీల మధ్య గొడవకు “బాధితుడిని” నేనే..
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇక మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విక్టరీ వెంకటేష్ తో F2, F3తో వరుస ప్లాప్స్ లో ఉన్న వెంకీకి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. దాంతో సీనియర్ హీరోలను అనిల్ రావిపూడి బాగా చూపిస్తాడు అనే నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను డైరెక్ట్ చేసాడు అనిల్. కెరీర్ లో మొదటి సారి తన కామెడీ ట్రాక్ ను పక్కన పెట్టి బానావో భేటికో షేర్ అనే కాన్సెప్ట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అనిల్ బాగా డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో ఏకంగా జాతీయ బెస్ట్ ఫిల్మ్ గా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరుతో మనశంకరవరప్రసాద్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు.
