సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద.. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, రూ.400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో, సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ బాధ్యతను అనిల్ రావిపూడి తన భుజాల మీద వేసుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా మేకింగ్ సమయంలో తాను పడ్డ టెన్షన్.. కొన్ని సీన్ల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read :Swayambhu : నిఖిల్ భారీ చిత్రం ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ముఖ్యంగా ఈ సినిమాలో ‘బుల్లి రాజు’ పాత్ర గురించి అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లి రాజు పాత్రకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాలో ఆ పాత్రను ఎలా చూపిస్తారో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూశారు, ఆ అంచనాలను అందుకుంటామా లేదా అని విడుదలకు ముందు రోజు వరకు టెన్షన్ పడ్డానని ఆయన తెలిపారు. అలాగే చిరంజీవితో ఒక సీన్‌లో బుల్లిరాజు ‘నన్ను దత్తత తీసుకోండి సార్.. చెర్రీ (చరణ్) పక్కన కర్రీలా పడి ఉంటాను’ ఆ డైలాగ్ సినిమాలో ఉంది. కానీ ఫ్లోలో ఇలా వచ్చి అలా వెళ్లి పోవడంతో ప్రేక్షకులు కనీసం ఆ డైలాగ్ ను నోటీస్ చేయలేక పోతున్నారు. ఆ డైలాగ్‌ను సినిమాలో మరో సందర్భంలో పెట్టి ఉంటే ఇంకా హైలైట్ అయ్యేదని ఇప్పుడు అనిపిస్తోందని అనిల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. మెగాస్టార్‌తో బుల్లి రాజు కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండటంతో ప్రేక్షకులు మరోసారి బుల్లి రాజు డైలగ్ ను పరిక్షించడం మొదలెట్టారు.
