మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా దూసుకెళ్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాతో విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది. ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు హీరోలు ఎదురుచూస్తున్నారు. మన శంకర సక్సెస్ నేపధ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే అనిల్ డైరెక్షన్ లో పవర్ స్టార్ సినిమా ఉంటుందని గత కొద్దీ రోజులుగా న్యూస్ వినబడుతోంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..
ఈ వార్తలపై స్పందించిన అనిల్ రావిపూడి “ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలవలేదు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని, ఆ కల నెరవేరితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రజాసేవకు సంబంధించిన అనేక కీలక పనులు ఆయనపై ఉన్నాయి. అలాగే, తమ ఇద్దరి కలయికలో సినిమా ఎప్పుడనే క్లారిటీ నాక్కూడా లేదు. కానీ మా కాంబినేషన్ కుదిరితే నేను చాలా సంతోషిస్తాను. ప్రస్తుతం మాత్రం ఎలాంటి ప్లాన్ లేదు అసలు ఆ దిశగా చర్చ కూడా జరగలేదు. భవిష్యత్తులో ఏమైనా సెట్ అవుతుందేమో చూద్దాం” అంటూ అనిల్ రావిపూడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
