Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. వరుసగా 9 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ “హిట్ మెషిన్” ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి తదుపరి సినిమాల కోసం టాలీవుడ్‌కు చెందిన నాలుగు అగ్ర నిర్మాణ సంస్థలు భారీ ఆఫర్లతో క్యూ కడుతున్నాయి, ఒక సినిమాకు ఏకంగా ₹50 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
READ ALSO: Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ
ఒకవేళ నిజంగా అనిల్ ₹50 కోట్ల పారితోషికం అందుకుంటే, టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుల జాబితాలో ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత స్థానాన్ని ఆయనే కైవసం చేసుకుంటారు. ప్రస్తుతం సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఈ రేంజ్‌లో ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ సహా మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్ కారణంగా నిర్మాతలు ఈ స్థాయి పారితోషికం ఇచ్చేందుకు వెనుకాడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆయన ఎందుకు ఈ రేంజ్‌లో డిమాండ్ చేస్తున్నారో అర్థమవుతుంది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వరుస విజయాలతో కెరీర్ ప్రారంభం అయినా ఎఫ్ 2 & ఎఫ్ 3: కామెడీ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాతో మహేష్ బాబుతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకుని భగవంత్ కేసరిలో బాలయ్యను సరికొత్తగా చూపిస్తూ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం & మన శంకర వరప్రసాద్ గారు అంటూ 2025, 2026 సంక్రాంతి సీజన్లను తన విజయాలతో షేక్ చేశారు. “కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే నిర్మాతలు ఆయనపై అంత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.” అని చెప్పొచ్చు.
READ ALSO: Mumbai Municipal Elections: ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా
