NTV Telugu Site icon

Anil Kumar Yadav vs Roop Kumar Yadav: చేతులు కలిపి కలిసిపనిచేయాలన్న సీఎం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..

Anil Kumar Yadav Vs Roop Ku

Anil Kumar Yadav Vs Roop Ku

Anil Kumar Yadav vs Roop Kumar Yadav: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదే సమయంలో.. పార్టీలో ఉన్న విభేదాలను తొలగించి.. అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే.. వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న విభేదాలపై దృష్టిసారించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రూప్ కుమార్ యాదవ్.. అనిల్ కుమార్ యాదవ్‌లు కలిసి పని చేయాలని కోరారు.. ఇటీవల కావలి పర్యటనలో ఇద్దరి చేతులు కలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. విభేదాలు పక్కనబెట్టి కలిసి ముందుకుసాగాలని సూచించారు.

Read Also: Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ..

అయితే, రెండు రోజుల తర్వాత దీనిపై స్పందించిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్.. కొందరికి సందేశాలు పంపారు.. ‘జగనన్న మాటని దేవుడి మాటగా భావిస్తా.. ఒకవేళ ఆ రాముడి మాటను ఈ హనుమంతుడు తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచి అయినా శాశ్వతంగా వైదొలుగుతా.. కానీ, రూప్ కుమార్ తో మాత్రం కలవను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాగా, నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి.. ప్రధానంగా.. మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆయన సొంత బాబాయ్‌, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌కి పొసగడం లేదు.. వీరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏకంగా సీఎం జగనే రంగంలోకి దిగారు. వీరిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు. రెండు రోజుల క్రితం ఇద్దరినీ కలిపారు సీఎం జగన్. ఇద్దరి చేతులను కలిపి, విభేదాలు వదిలేయాలని సూచించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల తర్వాత అనిల్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు జగనన్న మాట దేవుడి మాటగా భావిస్తాను అంటూనే.. మరోవైపు రూప్‌కుమార్‌తో కలిసేది లేదని తేల్చేశాడు అనిల్‌ కుమార్‌ యాదవ్.. కాగా, వైఎస్‌ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. కేబినెట్‌ 2లో మంత్రి పదవి కోల్పోయిన విషయం విదితమే.

Show comments