NTV Telugu Site icon

Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా జగన్‌ను అభిమానించేవారు కాదు..!

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్‌ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు.. నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని ప్రకటించారు. 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను.. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా.. రెండుసార్లు విజయం సాధించాను.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను.. వైఎస్‌ జగన్ కోసం సైనికుడిలా పని చేస్తాను.. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు.

Read Also: RBI : ఆర్బీఐ కొత్త ప్లాన్.. ఆన్ లైన్ లావాదేవీలకు ఇకపై ఓటీపీ అవసరం లేదు

రేపు నరసరావుపేటకు వెళుతున్నా.. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే.. అంతా కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఈ ప్రాంతం (నెల్లూరు) నాకు అన్నీ ఇచ్చింది.. వీరి దీవెనల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా అన్నారు. నాకు ఎవరి మీదా కక్ష్య లేదన్న ఆయన.. నాకు ఎందరో సహకరించారు.. నెల్లూరు సిటీకి అభ్యర్థిగా మైనారిటీ కి వైఎస్‌ జగన్ అవకాశం కల్పించారు.. ఒకరిద్దరు నాయకులు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. పార్టీ ఏమీ బలహీన పడదు.. కొత్త వారిని తీసుకు వస్తాం.. నేత మారినప్పుడు కొందరు వెళ్లడం సహజమే అన్నారు. నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా.. జగనన్న నన్ను పోటీ చేయమని చెప్పారు.. ఎవరికీ దొరకని అవకాశం నాకు లభించిందని భావిస్తున్నాను అన్నారు. రేపు సాయంత్రం నరసరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను అని వెల్లడించారు.

Read Also: CM Revanth Reddy: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తాం..

ఇక, జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయి అన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్.. నాలుగున్నర ఏళ్లు జగన్ దేవుడు ఇలా కనిపించారు.. జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు.. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చింది.. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. సీఎం జగన్ ఏమి చేయలేదో చెప్పాలి? అని నిలదీశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని కృష్ణ మూర్తి కి కూడా చెప్పారు.. ఆయన కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మరోవైపు, టీడీపీ ఎంతమంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి.. ప్రకాశం.. నెల్లూరు.. తిరుపతి జిల్లాల్లో బీసీలలో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయన ను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు అని దుయ్యబట్టారు.. ప్రజలంతా చూస్తున్నారు.. 2024లో మళ్లీ వైఎస్‌ జగన్‌ను ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్.