నెల్లూరు సిటీ పరిధిలోని కుసుమ హరిజన వాడలో 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు.. రెండు, మూడు రోజుల నుంచి నెల్లూరులో విచిత్రమైన పరిస్థితి ఉంది.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని నారాయణ ఒకవైపు తిరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొందరు టీడీపీ నేతలతో కలిసి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి తిరుగుతున్నారు.. ఇంతకూ ఎవరు పోటీ చేస్తారో తెలియని పరిస్థితిల్లో ఉన్నారు.. ఎవరి టికెట్ రాకపోతే వాళ్లు మాయం అవుతారు.. వాళ్ళు కనిపించే పరిస్థితి ఉండదు అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.
Read Also: Mega 156 : మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్న రానా.. కారణం అదేనా..?
నారాయణకు టికెట్ వస్తే మనుక్రాంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళిపోతారు.. ఒకవేళ మనుక్రాంత్ రెడ్డికి టికెట్ ఇస్తే నారాయణ హైదరాబాద్ కు వెళ్ళిపోతారు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు కూడా గమనించాలి.. మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావిడి చేస్తున్నారు.. టికెట్ ఇవ్వకపోయినా ప్రజల్లోనే ఉంటామని ఈ నేతలు ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. నన్ను మారుస్తున్నారని మాట్లాడుతున్నారు.. నామినేషన్ ఎవరు వేస్తారో మూడు నెలల్లో చూస్తారు.. మూడు నెలలు తిరిగే వారిని చూసి ప్రజలు మోసపోకూడదు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.