NTV Telugu Site icon

Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..!

Acee

Acee

వారిద్దరూ కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్నారు. దీన్ని గమనించిన అబ్బాయి తల్లిదండ్రులు సహించలేకపోయారు. అంతే ఉద్యోగం పేరుతో కుమారుడిని మరో ప్రాంతానికి తరలించి రహస్యంగా పెళ్లి చేసేశారు. అయితే ఈ పరిణామం ప్రియురాలికి రుచించలేదు. తనను మోసం చేసి ప్రియుడు మరో పెళ్లి చేసుకుంటాడా? అని పగతో రగిలిపోయింది. అంతే వరుడు పెళ్లి ఊరేగింపులో ఉండగా.. హఠాత్తుగా గర్ల్‌ఫ్రెండ్ ప్రత్యక్షమై యాసిడ్ దాడి చేసింది. దీంతో వరుడికి గాయాలు కావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kodandaram: కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదు

ఏప్రిల్ 23న ఉత్తరప్రదేశ్‌లో బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఆ ఊరేగింపులోకి పెళ్లికి వచ్చినట్టుగానే ఓ అమ్మాయి పెళ్లి దుస్తులు ధరించి వచ్చింది. ఉన్నట్టుండి వరుడిపై యాసిడ్ పోసింది. ఈ పరిణామంతో పెళ్లి ఊరేగింపులో ఉన్నవారంతా షాక్ అయ్యారు. యాసిడ్ మీద పడగానే వరుడు కిందపడిపోయాడు. అనంతరం అతడ్ని ఆస్పత్రికి తరలించారు. బంధువులు మాత్రం.. ఆ అమ్మాయిను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాసిడ్ దాడి చేసిన అమ్మాయి.. వరుడు గతంలో రిలేషన్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వరుడికి ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రమాదం నుంచి బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 326బి (ఎవరైనా స్వచ్ఛందంగా వివిధ ప్రమాదకర సాధనాలు లేదా సాధనాలను ఉపయోగించి తీవ్రమైన గాయాలు చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Maloth Kavitha: హామీలను ఏ ఏడాది ఆగస్టులో నెరవేరుస్తారు..?