Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Angkrish Raghuvanshi: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ వివాదంలో చిక్కుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించారు.
ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించబడింది. మ్యాచ్ లో జరిగిన సంఘటన తర్వాత రఘువంశీ తన అసంతృప్తిని బయటపెడుతూ బౌండరీ రాప్ పై బ్యాట్ తో కొట్టడం ఈ చర్యలకు కారణమైంది. ఈ వివాదానికి కారణమైన సంఘటన ఐదో ఓవర్ లో జరిగింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రఘువంశీ షాట్ ఆడిన తర్వాత సింగిల్ కోసం పరుగెత్తాడు. అయితే మధ్యలోనే కామెరాన్ గ్రీన్ అతన్ని తిరిగి పంపించాడు. క్రీజ్ లోకి చేరేందుకు పరుగెత్తే సమయంలో రఘువంశీ తన పరుగుల దిశను మార్చినట్లు కనిపించింది.
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ఈ సమయంలో అతను చేసిన “యూ-టర్న్” కారణంగా బంతి స్టంప్స్‌ను తాకకుండా అతని కాలి వద్ద తగిలింది. దీంతో ఎల్ఎస్జీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా, టీవీ అంపైర్ రీప్లేలను పరిశీలించి అతని దిశ మార్పు ఉద్దేశపూర్వకమని భావించి “obstructing the field”గా ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రఘువంశీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇరుజట్లు 20 ఓవర్లలో 155 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లక్నో జాయింట్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగా, కేకేఆర్ మొదటి బంతికే ఛేదించి విజయాన్ని అందుకుంది.
𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! 😳
Mix-up. Long turn. Third umpire drama… & Raghuvanshi is given OUT for obstructing the field! 👀
Just the 4️⃣th instance of a batter being given out for obstructing the field in TATA IPL 🤯#TATAIPL 2026 ➡️ #LSGvKKR | LIVE NOW… pic.twitter.com/WRgr608Odb
— Star Sports (@StarSportsIndia) April 26, 2026
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..