Site icon NTV Telugu

Anganwadi Strike: ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం.. బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరు..!

Anganwadi Strike

Anganwadi Strike

Anganwadi Strike: ఆంధ్రప్రదేశ్‌లో తమ డిమాండ్ల సాధన కోసం 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో, అంగన్వాడీలపై సీరియస్‌ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. అయితే, ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు. అత్యవసర విధులు అనుకుంటే, తమకు అందాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని గుర్తు చేస్తున్నారు అంగన్వాడీలు. తాము హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేసే వరకు సమ్మె విరమించబోమని తేల్చేశారు అంగన్వాడీలు.

Read Also: Devara Audio Rights: భారీ ధ‌ర‌కు ఎన్టీఆర్ ‘దేవర’ ఆడియో హ‌క్కులు!

మరోవైపు.. అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యం అన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు రామకృష్ణ. కాగా, అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. ఇక, ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.. ఇదే సమయంలో సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత పెట్టింది.. వేతనంలో సుమారు రూ.3 వేలు కోత విధించిన తర్వాత మిగతా సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసింది.. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం. పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది.. కానీ, జీతాల పెంపు, గ్రాట్యుటీ పై పెట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. దీంతో.. సీరియస్‌ యాక్షన్‌కు దిగిన సర్కార్.. అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనంగా రూ. 8050ని మాత్రమే జమ చేసింది ప్రభుత్వం.. నెల జీతం రూ. 11,500కు గానూ రూ. 8050 మాత్రమే జమ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు.

Exit mobile version