NTV Telugu Site icon

Big Breaking: ఏపీ ప్రభుత్వం తరపున అంగన్వాడీలకు జీవోఎం విజ్ఞప్తి చేస్తూ బహిరంగ లేఖ

Anganwadis

Anganwadis

Anganwadi workers Protest: అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అంగన్వాడీలకు విఙప్తి చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను పెంచామని తెలిపింది. మంచి పని తీరు కనబరిచిన వర్కర్లకు ప్రోత్సాహకాలు కూడా అందించాం.. ప్రోత్సాహకాల రూపంలో 27.8 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది.. ప్రమోషన్ల విషయంలోనూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్కొనింది.

Read Also: Nabhi Marma Benefits: చలికాలంలో శరీరం వెచ్చదనం కోసం ‘నాభి మర్మం’.. అంటే ఏంటో తెలుసా?

వివిధ సంక్షేమ పథకాల కింద అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు డీబీటీ ద్వారా 1,313 కోట్ల రూపాయలు అందించాము అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖలో తెలిపారు. నవరత్నాలు కార్యక్రమాల కింద అంగన్వాడీలకు వివిధ పథకాలు జగనన్న విద్యా దీవెన, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా వంటివి అందిస్తున్నాం.. అంగన్వాడీ వర్కర్లు వారి విధులు సక్రమంగా నిర్వహించేందుకు 56 వేల 984 స్మార్ట్ ఫోన్లు అందించాం.. వీటి కోసం ప్రభుత్వం 85.47 కోట్లు వెచ్చించింది.. డేటా ఖర్చుల కోసం ఏడాదికి 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొనింది. ఈ ఏడాది నుంచి అంగన్వాడి హెల్పర్లు, సహాయకులకు జీవిత బీమా కూడా ప్రభుత్వం అందిస్తోంది.. తాజాగా ప్రభుత్వం చేసిన పలు హామీలను కూడా ఈ లేఖలో జీవోఎం ప్రస్తావించింది. మీ కోర్కెల సాధనకు చేస్తున్న ఆందోళనలను కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గమనించాలి అని చెప్పింది.

Read Also: Jhansi: యాంకర్ ఇంట్లో విషాదం.. సలార్ ఓబులమ్మ ఎమోషనల్

ఈ ప్రభుత్వం మీది, మన అందరిదీ అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్కొనింది. మీరంతా మా వాళ్లు మీకు మరింత మంచి చేయాలనేదే మా తపన.. మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.. గర్భీణులు, బాలింతలు, చిన్నారుల ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం.. గర్భీణులు, బాలింతలు, పసి పిల్లల బాధ్యత మరింత కీలకం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూసుకునే పరిస్థితి తీసుకుని రావొద్దని కోరుతున్నాం.. సమ్మె నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామని జీవోఎం తెలిపింది.