NTV Telugu Site icon

Andrea Jeremiah : ‘సైంధవ్ ’తో యాక్షన్లో జాస్మిన్.. గన్నుతో మామూలుగా లేదు

New Project (4)

New Project (4)

Andrea Jeremiah : టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇది ఇలా ఉంటే వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు. అగ్ర నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బొబ్బిలిరాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే అందరూ వెంకటేష్ అనే చెబుతారు. వెంకటేష్ అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులు మెప్పించారు. ఇటీవలే ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. వెంకటేష్ తో పాటు రానా కూడా దీనిలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..

కానీ గత కొద్ది రోజులుగా వెంకటేష్ సోలోగా సక్సెస్ సాధించలేకపోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వెంకటేష్ తో పాటు ఉన్నటువంటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ రూ.100 కోట్ల కలెక్షన్లు ని కొల్లగొడుతుంటే వెంకటేష్ మాత్రం ఇంకా సోలో సక్సెస్ కోసం చాలా కష్టాలు పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో వెంకటేష్ రూట్ మార్చి హిట్ సిరీస్ లో టాలెంట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్నటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే టైటిల్ తో ఓ పవర్ పుల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. మొదటిసారి శైలేష్ కొలను ఓ స్టార్ హీరోని డీల్ చేస్తున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం తప్పకుండా వస్తుండొచ్చు.

Read Also: Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా

ఇదిలా ఉంటే, వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాతో త‌మిళ క‌థానాయిక‌ ఆండ్రియా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం ఆండ్రియా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో రివాల్వర్ తో స్పోర్ట్స్‌ బైక్ ముందు నిల్చొని స్టైలిష్ లుక్‌లో ఆండ్రియా క‌నిపిస్తోంది. సైంధ‌వ్ మూవీలో యాక్షన్ పాత్రలో ఆండ్రియా న‌టిస్తున్నట్లు స‌మాచారం. ఈ సినిమాతో దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఆండ్రియా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివ‌ర‌గా తెలుగులో నాగ‌చైత‌న్య, సునీల్ హీరోలుగా న‌టించిన త‌డాఖా సినిమాలో న‌టించింది. హిట్ – 2 త‌ర్వాత శైలేష్ కొల‌ను డైరెక్షన్లో ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.