AP ZPTC & MPTC Election Results: ఓట్ల లెక్కింపు షురూ.. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ZPTC & MPTC Election Results: రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పోలైన పరిషత్ ఎన్నికల ఓటింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 77 ZPTC, 2,051 MPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read
- 500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
- Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ 'మహమ్మద్ షమీ'..!
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
-
07 Nov 2026 09:30 AM (IST)
దుత్తలూరులో ముందంజలో టీడీపీ
నెల్లూరు దుత్తలూరు మండలం జడ్పిటిసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి. ముందంజలో టీడీపీ. టీడీపీ- 52, వైసీపీ- 11, బీఎస్పీ - 3, కాంగ్రెస్ -1, తిరస్కరణ - 2.
-
07 Nov 2026 08:50 AM (IST)
విజయవాడ మాంటిసోరి కాలేజీ లో మొదలైన ఓట్ల లెక్కింపు
విజయవాడ మాంటిసోరి కాలేజీ లో మొదలైన ఓట్ల లెక్కింపు.. విజయవాడ రూరల్ జడ్పీటీసి,ఎంపీటీసి ఓట్ల లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బంది.
-
07 Nov 2026 08:48 AM (IST)
కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత
కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్. ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలు. ఒక్క ఏజెంట్‌కే అనుమతివ్వడంపై పార్టీల నేతల అభ్యంతరం.
-
07 Nov 2026 08:22 AM (IST)
కాకినాడ పీఆర్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ ఆలస్యం
కాకినాడ పీఆర్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ ఆలస్యం.30 నిమిషాలు ఆలస్యం అవుతుందని ప్రకటించిన పోలీసులు. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా రావడం, పూర్తిస్థాయి లో ఏర్పాట్లు కాకపోవడం అంటున్న అధికారులు. అధికారులు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మండలాల వారీగా ఏజెంట్లను అనుమతిస్తామని చెబుతున్న పోలీసులు.
-
07 Nov 2026 07:54 AM (IST)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 429 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఏడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో పాటు తెనాలి, నరసరావుపేట, రేపల్లె, బాపట్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లాలో 67.52 శాతం, పల్నాడు జిల్లాలో 70.93 శాతం, గుంటూరు జిల్లాలో 73.12 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
07 Nov 2026 07:53 AM (IST)
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితాలపై ఆసక్తి
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణా జిల్లాలో 26 జడ్పీటీసీ, 343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 కేంద్రాల్లో 600 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి ఫలితం గుడివాడ నుంచి, రెండో ఫలితం పెనమలూరు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 16 జడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు 9 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 281 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో తొలి ఫలితం ఇబ్రహీంపట్నం నుంచి, తర్వాత తిరువూరు నుంచి వెలువడే అవకాశం ఉంది.
-
07 Nov 2026 07:52 AM (IST)
కడప జిల్లాలో కౌంటింగ్‌కు గందరగోళం
కడప జిల్లాలోని బద్వేల్ కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం 7 గంటలకే కేంద్రానికి చేరుకోవాల్సిన సిబ్బందిని ఇప్పటివరకు లోపలికి అనుమతించలేదు. ఫారాలు నింపే ప్రక్రియ ఆలస్యం కావడంతో కౌంటింగ్ ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. మైదుకూరు, బి.మఠం నుంచి వచ్చిన సిబ్బందికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
-
07 Nov 2026 07:43 AM (IST)
ఉత్తరాంధ్రలో ఐదు అంచెల భద్రత మధ్య కౌంటింగ్‌కు ఏర్పాట్లు..
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. విశాఖ జిల్లాలో 4 జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు, అనకాపల్లి జిల్లాలో 24 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, అల్లూరి జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. విశాఖలో 82.5 శాతం, అనకాపల్లిలో 75.58 శాతం, అల్లూరిలో 60 శాతం పోలింగ్ నమోదైంది.
-
07 Nov 2026 07:41 AM (IST)
నెల్లూరులో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలకు గానూ 7 ఏకగ్రీవం కాగా, 39 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 554 ఎంపీటీసీ స్థానాల్లో 115 ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో 70.62 శాతం పోలింగ్ నమోదైంది. గూడూరులో అత్యధికంగా 83.57 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో 352 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
-
07 Nov 2026 07:40 AM (IST)
పోలవరం జిల్లాలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
పోలవరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలకు 45 మంది, 101 ఎంపీటీసీ స్థానాలకు 275 మంది అభ్యర్థులు పోటీ చేశారు. చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 202 టేబుళ్లు సిద్ధం చేసి, ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్ చొప్పున 202 మందిని నియమించారు.
-
07 Nov 2026 07:39 AM (IST)
విజయనగరం జిల్లాలో 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు నేడు కౌంటింగ్..
విజయనగరం జిల్లాలో నేడు 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలతో పాటు విజయనగరం మండలానికి సంబంధించి వేర్వేరు కళాశాలలు, పాఠశాలల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు 452 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
07 Nov 2026 07:38 AM (IST)
ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 27 జడ్పీటీసీ, 454 ఎంపీటీసీ స్థానాలకు గానూ 1 జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 26 జడ్పీటీసీ, 441 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
-
07 Nov 2026 07:37 AM (IST)
పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..
పల్నాడు జిల్లాలో 10 జడ్పీటీసీ, 37 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేటలోని పెట్లూరివారిపాలెంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ మండలాల్లో కౌంటింగ్ కోసం టేబుళ్లు సిద్ధం చేశారు. అయితే సత్తెనపల్లి, ముప్పాళ్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
-
07 Nov 2026 07:36 AM (IST)
నెల్లూరులో ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు.. 6 రౌండ్లలో కౌంటింగ్.!
నెల్లూరు జిల్లాలోని ఏడు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 5 గదుల్లో 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 6 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
07 Nov 2026 07:34 AM (IST)
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో 24 జడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 7 కేంద్రాల్లో 398 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 76.3% పోలింగ్ నమోదైంది. అలాగే తిరుపతి జిల్లాలో 31 జడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు 8 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ 68.67 శాతం పోలింగ్ నమోదైంది.
-
07 Nov 2026 07:32 AM (IST)
తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
తూర్పుగోదావరి జిల్లాలో 21 జడ్పీటీసీ, 405 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని 12 జడ్పీటీసీ స్థానాల ఓట్లను నన్నయ యూనివర్సిటీలోని రెండు బ్లాక్‌లలో లెక్కించనున్నారు. నిడదవోలు బాలికల హైస్కూల్లో మరో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని స్థానాలకు వేములూరులో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
-
07 Nov 2026 07:31 AM (IST)
నంద్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
నంద్యాల జిల్లాలో నేడు 5 రెవెన్యూ డివిజన్ల పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 20 జడ్పీటీసీ, 224 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరులో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 275 టేబుళ్లను సిద్ధం చేశారు.
ట్రెండింగ్
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!