NTV Telugu Site icon

Andhrapradesh: జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల

Cec

Cec

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: Ayodhya Ram Temple: 500 ఏళ్ల చరిత్ర.. 1528 నుంచి 2024 వరకు అయోధ్య రామ మందిరంలో కీలక ఘట్టాలు తెలుసుకోండి..

ఇదిలా ఉండగా.. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన సీఈఓ ఎంకే మీనా.

మొత్తం ఓటర్లు: 4,08,07,256

పురుషులు: 2,00,09,275

మహిళలు: 2,07,37,065

ధర్డ్ జెండర్: 3482

సర్వీస్ ఓటర్లు: 67,434

అత్యధిక ఓటర్లు: కర్నూలు జిల్లా: 20,16,396

అత్యల్ప ఓటర్లు: అల్లూరి జిల్లా: 7,61,538

*ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో పెరిగిన ఓటర్ల సంఖ్య. సుమారు 5.86 లక్షల మేర పెరిగిన ఓటర్లు.

*ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా 70 కేసుల నమోదు. నెల్లూరు, బాపట్ల, నంద్యాల, అనంతపూర్, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదు.

*తుది జాబితాపై అభ్యంతరాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు. స్పెషల్ సెల్ ఇన్ఛార్జీగా అదనపు సీఈఓ హరేంధీర ప్రసాద్.

Show comments