AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం విశాఖ జిల్లాలో ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వేచి ఉన్న పెద వాల్తేర్ కు చెందిన కె. రమేష్ (11)ని ముఖ్యమంత్రి పలకరించారు. తల్లి కె. లక్ష్మి , తన కుమారుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రిని ఆర్థిక సహాయం కోరగా.. ముఖ్యమంత్రి స్పందించి వైద్యం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంటనే రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
Also Read: BRS MPs meeting: కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే.. ఊరుకోం..
విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఇనార్బిట్ మాల్ చేరుకున్న ముఖ్యమంత్రి, అక్కడ ఆర్దోపెడిక్ సమస్యతో బాధపడుతున్న గవిడి ఢిల్లీశ్వరరావు (9) ను ముఖ్యమంత్రి పరామర్శించారు. కంచరపాలెం, బాపూజీనగర్‌కు చెందిన ఢిల్లీశ్వరరావు తల్లి గవిడి సంతోషి, తన కుమారుడు పుట్టుకతో ఆర్దోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడని ముఖ్యమంత్రికి తెలిపారు. వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గవిడి ఢిల్లీశ్వరరావుకి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జనను ఆదేశించగా.. జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.