AP New Ministers: ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు వీరే..
- ఏపీలో కొలువుదీరిన కొత్త సర్కారు
- సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- మంత్రులుగా 24 మంది ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Ministers: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా… ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
జనసేన పార్టీ నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోడీ.. మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫొటో దిగారు. అనంతరం స్టేజీ మీద ఉన్న వారితో ప్రధాని మోడీ సంభాషించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
Read Also: Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జీతన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!