NTV Telugu Site icon

AP Assembly Sessions: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

Ap Assembly

Ap Assembly

AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్‌ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.

Also Read: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్‌.. వైసీపీ గూటికి కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మంగళవారం సీఎం జగన్‌తో చీఫ్ విప్ ప్రసాదరాజు భేటీ అయ్యారు. పలు కీలకాంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.