Andhra woman Arrest: డబ్బులు చెల్లించకుండా 15 రోజులగా ఢిల్లీలోని ఓ హోటల్‌లో బస చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఏరో సిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో గత 15 రోజులుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 37 ఏళ్ల మహిళ ఉంటోందని, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Read Also: Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!
హోటల్ రెంట్ చెల్లించాలని సిబ్బంది అడగడంతో ఆమె వారిపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించిందని ఆరోపించారు. ఏపీకి చెందిన ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ డిసెంబర్ 13న హోటల్‌ను బుక్ చేసినట్లు వారు చెప్పారు. హోటల్ సర్వీసెస్ కోసం ఆమె మోసపూరిత చెల్లింపు పద్దతులను ఉపయోగించినట్లు పుల్‌మన్ హోటల్ అధికారులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఐజిఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 420 (చీటింగ్) కింద కేసు నమోదుచేసి, మహిళను అదుపులోకి తీసుకుని విచారించినట్లు అధికారులు వెల్లడించారు.