Site icon NTV Telugu

Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

Visakha News

Visakha News

Visakha Case: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలన్నారు.

అసలేం జరిగిందంటే..
విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక వారి చేతిలో నరకం చూసింది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగరంలోని పలు లాడ్జిలలో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికు రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

Read Also: Masood Azhar Died: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్‌ అజార్‌ మృతి..!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు కుక్కలకు ఆహారం పెట్టే పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడిని పురమాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది. అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

Exit mobile version