RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs DC: కేఎల్ రాహుల్ క్లాస్.. ట్రిస్టన్ స్టబ్స్ మాస్.. డేవిడ్ మిల్లర్ పవర్.. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసినా, ఢిల్లీ బ్యాటర్ల పట్టుదల ముందు అది సరిపోలేదు. ఆఖరి ఓవర్లో మిల్లర్ సృష్టించిన విధ్వంసం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి, చివరికి ఢిల్లీని విజయం వరించింది. ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
READ ALSO: CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మ్యాచ్ హైలైట్స్ ఇవే..
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. నిశ్శంక (1), కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ పంపి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ (57; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అయితే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. రాహుల్ అవుటైన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (59 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయానికి చేరవ చేశాడు. అక్షర్ పటేల్ (26) మెరుపులు మెరిపించినా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన రసిక్ సలామ్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. ఈ సమయంలో మిల్లర్ ‘కిల్లర్’ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ పథంలో నడిపించాడు. రోమారియో షెపర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులకు కేవలం 2 పరుగులే వచ్చాయి. కానీ 3వ, 4వ బంతికి డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 5వ బంతికి ఫోర్ కొట్టడంతో ఢిల్లీ ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది.
READ ALSO: RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!