AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Alert: రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. గూడూరు (నెల్లూరు జిల్లా)లో ఈ సీజన్లోనే అత్యధికంగా 45.8°C నమోదైంది. అలాగే పిడుగురాళ్ల (పల్నాడు)లో 45.2°C, నందనమారెళ్ల (మార్కాపురం)లో 45°C, రాయలచెరువులో 44.3°C నమోదయ్యాయి. తొర్రగుడిపాడు (ఎన్టీఆర్), వలేటివారిపాలెం (ప్రకాశం)లో 43.6°C, కారంచేడు (బాపట్ల), తవణంపల్లె (చిత్తూరు)లో 43.5°C నమోదయ్యాయి. సంజామల (నంద్యాల)లో 43.2°C, కోడూరు (వైఎస్సార్ కడప)లో 43°C నమోదయ్యాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో 216 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మే 1, 2026న వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 7 మండలాలు, పోలవరం జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 49 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 11 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రేపటి నుంచి వాతావరణం మారనుంది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు అకాల వర్షాలు కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. పిడుగుల సమయంలో రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!