Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?
- మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి.. బీర్ విక్రయాలు 70 శాతం పెరుగుదల..
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, ముఖ్యంగా బీర్ మరియు భారతీయ తయారీ మద్యం (ఐఎంఎల్) అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో మొత్తం సేల్స్ విలువలో స్పష్టమైన వృద్ధి నమోదైంది. గణాంకాల ప్రకారం, ఐఎంఎల్ విక్రయాలు 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు పెరిగి 14.59 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు బీర్ విక్రయాలు మాత్రం 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి 70.29 శాతం భారీ పెరుగుదల సాధించాయి. ఈ పెరుగుదలతో మొత్తం మద్యం అమ్మకాల విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు చేరి 6.11 శాతం వృద్ధి నమోదు అయ్యింది.
అయితే, అమ్మకాలు పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. మద్యం సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.24,734 కోట్ల నుంచి రూ.25,727 కోట్లకు పెరిగి 4.01 శాతం వృద్ధి సాధించింది. కానీ, ఎల్ఎఫ్ మరియు ఇతర విభాగాల ఆదాయం రూ.4,112 కోట్ల నుంచి రూ.3,316 కోట్లకు పడిపోయి 19.37 శాతం తగ్గింది. ఈ ప్రభావంతో మొత్తం ఆదాయం రూ.28,846 కోట్ల నుంచి రూ.29,042 కోట్లకు మాత్రమే పెరిగి 0.68 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగడం కూడా ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా రూ.99 ధర ఉన్న 180 మిల్లీ లీటర్ బాటిళ్ల వినియోగం పెరగడంతో సుమారు రూ.442 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గించడంతో మరో రూ.972 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గత సంవత్సరంతో పోలిస్తే 180 మిల్లీ లీటర్ బాటిల్ సగటు ధర రూ.180 నుంచి రూ.160కి తగ్గడం కూడా ఆదాయంపై ప్రభావం చూపింది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో లభించిన సుమారు రూ.1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి లేకపోవడం వల్ల కూడా రెవెన్యూలో తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, మొత్తం గణాంకాలు రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇది ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి కొంత మేర ఉపయోగపడుతుండగా, మరోవైపు సామాజిక, ఆరోగ్యపరమైన అంశాలపై చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!