Site icon NTV Telugu

CM KCR On BRS Party: బీఆర్ఎస్ సరదా కోసం కాదు.. దేశం కోసం

Brs Ap

Brs Ap

తెలంగాణ భవన్ లో ఇవాళ సందడి నెలకొంది. ఏపీకి చెందిన నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలకు స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, జేటీ రామారావు, వంశీ కృష్ణ, సతీష్ కుమార్, ఫణికుమార్, మణికంఠ, నయిముల్ హక్ లకు స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే త‌మ‌షా కోస‌మో, చ‌క్కిలిగింత‌ల కోస‌మో, దేశంలో ఒక మూల కోస‌మో, ఒక రాష్ట్రం కోస‌మో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫ‌ర్ ఇండియా. క‌చ్చితంగా ల‌క్ష కి.మీ. ప్రయాణ‌ం అయినా తొలి అడుగుతోనే ప్రారంభ‌మ‌వుతుంది. ల‌క్ష్య శుద్ధి, సంక‌ల్ప శుద్ధి ఉంటే.. సాధించ‌లేనిదంటూ ఏమీ ఉండ‌దు. ప్రపంచంలో మాన‌వ‌జీవితంలో అనేక ప‌ర్యాయాలు ఆ విష‌యాలు రుజువ‌య్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠసార‌థితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

Read Also: Indian Railways: 2021తో పోలిస్తే 2022లో రైల్వేశాఖకు భారీగా పెరిగిన ఆదాయం

మీ అంద‌రికి స్వాగ‌తం చెబుతున్నా.. అయితే మీపై చాలా పెద్ద బాధ్యత పెడుతున్నానన్నారు కేసీఆర్. స్వాతంత్ర్యానికి పూర్వం రాజ‌కీయాలంటే త్యాగం. జీవితాల‌ను ఆస్తుల‌ను, కుటుంబాల‌ను, అవ‌స‌ర‌మైతే ప్రాణాల‌ను త్యాగం చేసేట‌టువంటి రాజ‌కీయాలు ఉండేవి. ఆ త‌ర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గద‌ర్శనంలో రాజ్యాంగాన్ని రూప‌క‌ల్పన చేసుకుని కార్యకలాపాలు మొద‌లుపెట్టాం. చ‌క్కటి ప్రయాణాన్ని మొద‌లుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు. వార్షిక ప్రణాళిక‌లు, పంచ‌వ‌ర్ష ప్రణాళిక‌లు, ఒక విజ‌న్, డైరెక్షన్ ఏ ప‌ద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాల‌ని చాలా ప్రయ‌త్నాలు జ‌రిగాయి. కొన్ని బాట‌లు వేయ‌బ‌డ్డాయి. సాగుతూ వ‌చ్చాం.

ఆ త‌ర్వాత రాజ‌కీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభ‌వించాయి. గ‌త 50 ఏండ్ల సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో నాకు అవ‌గాహ‌న క‌లిగిన‌టువంటి భార‌త‌దేశం ఏ ద‌శ‌కు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్ర‌జ‌ల కోరిక‌లు, స్వాతంత్ర్య ఫ‌లాలు సిద్ధించ‌లేదు. మ‌న కంటే అమెరికా, చైనా ముందున్నవి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవ‌సాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉంది. కానీ మ‌న దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంటే అందులో ర‌మార‌మి 40 కోట్ల ఎక‌రాల భూమి వ్య‌వ‌సాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు.

మనదేశంలో అనేక వనరులు ఉన్నాయన్నారు. వ్యవ‌సాయం బాగా, అద్భుతంగా జ‌ర‌గాలంటే.. సూర్యకాంతి ఉండాలి. అప్పుడే పంట‌లు పండుతాయి. సూర్యకాంతి కూడా అపారంగా ఉంది. మ‌న వ‌ద్ద మూడు ర‌కాల ప‌ర్యావ‌ర‌ణ మండ‌లాలు ఉంటాయి. స‌ముద్ర తీర‌ప్రాంతాల్లో ఉండే వాతావ‌ర‌ణం ప‌లు రాష్ట్రాల్లో ఉంది. ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్‌క‌లిగి ఉండే కంట్రీగా ఉండాలి. మ‌న రైతు లోకమంతా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ 13 నెల‌ల పాటు రైతులు ధ‌ర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయార‌ని కేసీఆర్ ఆవేద‌న వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయాల విలువైన పామాయిల్, కందిప‌ప్పును దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దేశం వంచించ‌బ‌డుతుంది. ఈ దుస్థితి కొన‌సాగాల్నా. లేదు నివారించ‌బ‌డాల్నా.. ప్రజాజీవితంలో ఉండే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ప్రపంచంలో మాన‌వ‌జీవితంలో అనేక ప‌ర్యాయాలు ఆ విష‌యాలు రుజువ‌య్యాయి అని కేసీఆర్ గుర్తు చేశారు.

మ‌న దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్షల మెగావాట్లు. కానీ దేశం ఏనాడూ కూడా రెండు ల‌క్షల 10 వేల మెగావాట్లకు మించి వాడ‌లేదు. నీళ్లుంటాయి కానీ పొలాల‌కు రావు. క‌రెంట్ ఉంట‌ది కానీ ప్రజ‌ల‌కు రాదు. వ‌న‌రులు, వ‌స‌తులు ఉండి ఈ దేశం ప్రజ‌లు శిక్షించ‌బ‌డాలి. వంచించ‌బ‌డాలి. ఈ ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగాలి? ఇందులో ఏదైనా మార్పు రావాలి అన్నారు. ఏపీ నుంచి బీఆర్ఎస్ నేతల చేరికతో హైదరాబాద్ లో సందడి నెలకొంది.

Umran Malik: షోయబ్ అఖ్తర్ రికార్డ్‌ని తప్పకుండా బద్దలుకొడతా

Exit mobile version