NTV Telugu Site icon

High Court: ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? ప్రశ్నించిన హైకోర్టు

Ap High Court

Ap High Court

High Court: ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఆర్-5 జోన్‍పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు లాయర్లు.. పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. ఇక, తాము ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ పిటిషన్‍లోనే పేర్కొన్నామన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టు వివరించారు.. ఇళ్ల నిర్మాణంపై తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం వృధా అవుతుంది కదా? అని వ్యాఖ్యానించింది హైకోర్టు.. ఇక, లంచ్‌ తర్వాత కూడా ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై వాదనలు కొనసాగనున్నాయి.

Read Also: Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్

కాగా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దాఖలైన రిట్‌ పిటిషన్లపై ఈ నెల 17న విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాద్, వి.జ్యోతిర్మయిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.. అనంతరం తదుపరి విచారణ చేపట్టేందుకు కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.. ఇక, సోమవారం రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున లాయర్‌ ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. భూమి బదలాయింపు సీఆర్డీఏకు పూర్తిగా జరగలేదన్నారు. అనుబంధ ఒప్పందంలో ఎవరికి ఏ భూమి అనేది ఇంకా తేలలేదని, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తేనే.. ఒప్పందం పూర్తవుతుందని లాయర్‌ మురళీధర్ కోర్టుకు తెలిపారు. మరి.. ఈ రోజు ఇంకా ఎలాంటి వాదనలు కొనసాగుతాయో చూడాలి.