CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్‌లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి జరిగితే భూముల ధరలకు రెక్కలు వస్తాయి.. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అన్నారు.. పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం.. అమరావతి, విశాఖ, తిరుపతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ప్రతి 6 గంటలకోసారి..
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనలో మాట్లాడుతూ రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో NDA ప్రభుత్వం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. “నాది, పవన్ కళ్యాణ్ ది అదే ఆకాంక్ష. అభివృద్ధి జరగాలంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి,” అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతామని వెల్లడించారు. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామసభలు కేవలం రూపకల్పనలుగా కాకుండా నిజమైన మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్‌గా అమలు చేసిన ఘనత NDA ప్రభుత్వానికి చెందినదని అన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్రం ఖర్చు చేసే మొత్తం ఏ దేశంలో మరే రాష్ట్రం చేయడం లేదని తెలిపారు. ఏపీ రాష్ట్రం ప్రతి ఏడాది 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందిస్తోంది. వీటిలో 59% లాభాలు మహిళలకు లభిస్తున్నాయి. రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు, నీరు, విద్యుత్, ఎరువులు సమృద్ధిగా అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని సమృద్ధిగా ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
