AP Governance: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ గా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి.. అలాగే రాబోయే రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!
ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. నేడు (జూన్ 23) సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో సమావేశం జరుగనుంది. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండేది. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
Read Also: Tirumala Darshanam: నేడు సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లు విడుదల..!
ప్రభుత్వ పాలనలో గత ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టనుంది. అలాగే వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనా దృష్టి పెట్టనున్నారు.
వేదిక పై వివిధ శాఖల పనితీరు పై సీఎం చంద్రబాబు ప్రశ్నలు.. మంత్రుల సమాధానాలు ఉండనున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు – పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన తదితర అంశాల పై సీఎం చంద్రబాబు ప్రసంగం ఇవ్వనున్నారు. గత ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు, రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే పేరిట ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఏం చెయ్యాలి..? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి..? అనే అంశాల పై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, మంత్రులకు సమావేశం ముగిసిన తరువాత వారితో సీఎం చంద్రబాబు డిన్నర్ చేయనున్నారు.
