Site icon NTV Telugu

Andhra Pradesh: విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సర్కార్‌ ఫోకస్‌

Cbn

Cbn

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చే దిద్దేందుకు పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో విశాఖ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు చర్చించారు చంద్రాబు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి..

Read Also: UP: కొంప ముంచిన కోతి.. రూ.20 లక్షల విలువైన నగల పర్సుతో జంప్..!

వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. 36 వేల చదరపు కిలో మీటర్లలో విస్తరించిన విశాఖ రీజియన్‌లో కోటి 50 లక్షల మంది జనాభా ఉన్నారన్నారు. ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల GDP నమోదవుతోందని, దానిని 2032 నాటికి 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలన్నారు చంద్రబాబు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు చంద్రబాబు. మొత్తానికి విశాఖ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా అటు పెట్టుబడులను ఆకర్షించడం… ఇటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version