NTV Telugu Site icon

Botsa Satyanarayana: హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తిస్తాం.. క్వాలిటీ ముఖ్యం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో హెటల్‌ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏపీ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోటల్‌ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.. హెటల్‌ రంగాన్నిఇండస్ట్రియల్‌ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుపడాలి.. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూదన్నదే మా ప్రభుత్వ ఉద్ధేశం అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ఇదే సమయంలో.. హోటల్స్ లో భోజనం క్యాలిటీగా ఇవ్వాలని సూచించారు.. క్వాలిటీగా ఇస్తేనే.. ప్రజలు హోటల్స్‌కు వస్తారని తెలిపారు.. ఏ రంగంలో నైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలి.. అదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకువస్తే.. వెంటనే వాటిని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.. కాగా, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్‌వీ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

Read Also: Manchu Lakshmi: నిహారికకు ఏం తక్కువ.. వారి కెరీర్ ను పాడుచేస్తున్నారు