CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని అంశాల్లో ఆప్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ఆప్ పాలన వైఫల్యాలను చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుచేశారు. ఆసుపత్రుల నిర్వహణ, తాగునీరు సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ మౌలిక వసతుల కల్పనలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆలోచించాలని సూచించారు. భవిష్యత్ అభివృద్ధికి ఢిల్లీకి డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే సరైన మార్గం అని చెప్పారు.
Also Read: MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
అంతేకాకుండా, “కమ్యూనిజం ఈజ్ ఓవర్, ఓన్లీ టూరిజం ఈజ్ ఎశెన్షయల్” అని ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు మరింత స్పష్టమయ్యాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు మెరుగుపడాలంటే బీజేపీకే ఓటు వేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధే తన ప్రధాన అజెండా అని, సిద్ధాంతాల కంటే ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యం అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో రాజకీయ చర్చలకు దారితీశాయి. లిక్కర్ స్కామ్ తో పాటు ఆప్ ప్రభుత్వ పరిపాలనపై చంద్రబాబు చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనాన్ని రేపాయి.