ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. ఇక యూత్ అయితే ఫోన్లో గేమ్స్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు.. అయితే నాలాడ్జ్ పెంచుకోవడం మాత్రమే కాదు సెల్ ఫోన్ వల్ల రెండు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి.. గేమింగ్‌కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది..
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. రాష్ట్రంలోని కర్నూలు నంద్యాల జిల్లాలో ని మహానంది మండలం లో సెల్‌ఫోన్ గేమింగ్ సంబంధించి బసవాపురం, గాజులపల్లె గ్రామాల యువకుల మధ్య వివాదం జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర దూషణలకు దారితీసింది. బసవాపురాని కి చెందిన యువకుడు ఇంటికి వెళ్లాక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. దీంతో బుధవారం రాత్రి దాదాపు 50 మంది బసవపురం వాసులు గాజులపల్లె గ్రామంలోకి వచ్చారు. కర్రలు, కత్తులు చేత పట్టుకని ఆ గ్రామంలోని కొందరు యువకులు, వారి కుటుంబ సభ్యులను గాలిస్తూ దాడులు చేశారు..
ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు.. ఈ క్రమం లో తాజ్, జహరాబీ దంపతులను తీవ్రంగా కొట్టడంతో వారింటి తలుపులు పగల గొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఫోర్స్ తో సహా వెంటనే గ్రామానికి చేరుకున్నారు.. దాడులు చేసుకుంటున్న గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.. ఇద్దరి యువకుల కోసం అది కూడా గేమ్ కోసం రెండు గ్రామాలు కొట్టుకోవడం సినిమాను తలపించిందనే చెప్పాలి.. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పై చర్చించుకుంటున్నారు.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..