NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలకాంశాలపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అమ‌రావ‌తిలో 20 వేల కోట్ల విలువైన ప‌నులకు పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌పై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ అథారిటీ అమోదించిన ప‌లు ప్రాజెక్ట్‌ల ఆమోదం కోసం కేబినెట్ ముందుకు ప్రతిపాద‌న‌లు రానున్నాయి. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్‌లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మిన‌హాయింపుపై చర్చించనున్నారు. ప‌లు ప‌రిశ్రమ‌ల‌కు భూ కేటాయింపుల విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Mumbai Train Incident: మహిళల కంపార్టుమెంట్‌లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు.. (వీడియో)

కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్‌ రైస్‌ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్‌ రైస్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.