NTV Telugu Site icon

Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?: ఎంపీ భరత్

Margani Bharath

Margani Bharath

రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నందుకు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా కడుపు మంట చల్లారిందో? అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండని.. అవ్వ, తాత, దివ్యాంగులను లైన్లో మళ్లీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి.. మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని చంద్రబాబును ఎంపీ భరత్ ప్రశ్నించారు.

Also Read: Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!

‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండి. అవ్వ, తాత, దివ్యాంగులను లైన్లో మళ్లీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి.. మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు. వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు. లోకేష్, చంద్రబాబుకు చెప్పి పెన్షన్లు వాలంటీర్లతో ఇవ్వకుండా అడ్డుకున్నది తానేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడం దారుణం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి అవ్వా, తాతలకు పెన్షన్ అడ్డుకున్నామని టీడీపీ నాయకులు కాలర్ ఎగరేసి చెబుతున్నారు. టీడీపీ నాయకుల దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. వాలంటీర్లు కాకుండా ఎవరు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?’ అని ఎంపీ భరత్ పేర్కొన్నారు.

Show comments