Visakha Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమను రెండు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు ఉన్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సులో ఫైల్స్, కొన్ని పరికరాలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ ఫైల్స్ దేనికి సంబంధించినవి అనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Read Also: Family Suicide Case: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ కేసులో పోలీసులు ఏమన్నారంటే?
ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్‌లో సంధ్య ఆక్వా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో విలువైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు కంపెనీ ప్రతినిధులు బయటకు పంపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎంప్లాయిస్‌ను తరలించే బస్సులో డాక్యుమెంట్లను పోలీసులు కనుగొన్నారు. నాలుగు రోజులుగా మూలపేట ఒక కాలనీలో సంధ్య ఆక్వా యాజమాన్యం బస్సును ఉంచింది. సీబీఐ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో డాక్యుమెంట్స్ ఎక్కడికి తరలిస్తున్నట్లు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్ బ్రేక్ డౌన్ కారణమని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అసలు తనిఖీల సమయంలో విలువైన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బస్సును సీబీఐ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు. బస్సు నెంబర్ AP39TP24 57 అని పోలీసులు వెల్లడించారు.