టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకుంది. మహేష్ బాబు పి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకు కథనం, రామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. రామ్ ఎనర్జీ, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్‌లో సక్సెస్ అయ్యాక, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. సినిమాని థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు, లేదంటే మళ్లీ చూడాలనుకునే వారు ఈ ఓటీటీ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన అప్‌డేట్ ఏంటంటే,
Also Read : Lenin : అఖిల్ ‘లెనిన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ..
ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్క తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మూవీలో రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమాకు వివేక్-మెర్విన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో దీనిపై మొదట్నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. క్రిస్మస్ రోజున ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
