Andhra king Thaluka: ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని సరైన హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే ఇతర ప్రమోషనల్ స్టఫ్‌కి కూడా ఈ సినిమా విషయంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ సినిమా ముందే విడుదల కావాల్సి ఉంది కానీ, సినిమా వాయిదా వేసి నవంబర్ 28వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
READ MORE: India Weather Update: ఈ 12 రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన..
అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాని ప్రీ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఒకరోజు ముందుగానే, అంటే నవంబర్ 27వ తేదీన, రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా, ఇప్పటివరకు ఆ రోజు సినిమాలేవి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ 27వ తేదీ రిలీజ్ అయినా, లేక 28వ తేదీ రిలీజ్ అయినా, అది రామ్ సినిమాకి సోలో రిలీజ్ అని చెప్పాలి. కాకపోతే, ఒకరోజు ముందు రిలీజ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
READ MORE: Imposes Limit on Gold Jewelry: పెళ్లిళ్లలో మూడు బంగారు నగలు మించితే రూ.50 వేలు ఫైన్..!
