ఈనెల 13 నుండి 27వరకూ మూలపాడులో బీసీసీఐ అండర్-19 క్వాండరంగల్ వన్ డే మ్యాచ్ లు జరగబోతున్నాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఇండియా ఏ, ఇండియా బీ పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ టీమ్స్ ఆడబోతున్నాయి.. ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకూ మ్యాచ్ లు జరుగుతాయి.. ముందుగానే టీమ్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాయని ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన మ్యాచ్ లు ఆడేందుకు మూలపాడు స్టేడియాన్ని మంజూరు చేసిన బీసీసీఐకి కృతజ్ఞతలు.. ఏపీలో మంచి క్రికెట్ గ్రౌండ్స్, మౌలిక వసతులు ఉన్నాయని గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Subhaman Gill: నాకు ఆ జెర్సీ నెంబర్ అంటేనే ఇష్టం.. కానీ ఈ నెంబర్ వచ్చింది..
త్రిపుర, మేఘాలయ నుంచి వచ్చి ఆంధ్రా గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతోంది.. ఈ ఏడాది అనేక మ్యాచ్ లు జరిగాయి.. సౌత్ టీమ్ లో నలుగురు ఆంధ్రా ప్లేయర్స్ ఉన్నారు అని ఆయన తెలిపారు. ప్రీమియం లీగ్స్ లో ఆంధ్రా ప్లేయర్స్ టాలెంట్ బయట పడుతుంది.. ముంబై ఇండియన్స్ టీంకు మన ప్లేయర్సును ట్రయల్స్ కి పిలిచారు.. ఏడేళ్ల తరవాత విశాఖలో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అని ఏసీఏ సెక్రెటరీ గోపీనాథ్ రెడ్డి అన్నారు.
Read Also: Duet: చిన్న కొండన్న.. ఇది కూడా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీనేనా..?
జోన్ లెవల్ నుంచి స్టేట్ లెవల్ వరకు ఉన్న ప్లేయర్లకి నెలకు 3వేల రూపాయలు ఇస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుని కోటిన్నరపైగా ఖర్చు చేస్తున్నామన్నారు.. కోచింగ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి.. నేషనల్ క్రికెట్ అకాడమీకి 20 మంది ప్లేయర్లు వెళ్లారు అని గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు.